RRR.. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ.. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి సూపర్ హీరోస్ రియల్ హీరోల పాత్రలని ప్రతిభింబించేలా చేస్తున్న క్రేజీ మూవీ.. ఈ సినిమా టీజర్ ను జనవరి 26న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో ధర్మస్థలిలో జరిగే యుద్ధాన్ని ఆచార్యగా చూపించబోతున్నారు. ఈ సినిమా టీజర్ కూడా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ రెండు టీజర్ల మధ్య్త పోటీ తప్పేలా లేదు. ఓ పక్క కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ రికార్డులు బద్ధలు కొట్టి తమ హీరో స్టామినా ప్రూవ్ చేయాలని తెలుగు హీరోల ఫ్యాన్స్ నడుం బిగించారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ రెండిటిలో రాం చరణ్ ఉన్నాడు. సో ఈ రెండు సినిమాల టీజర్ల మధ్య కూడా గట్టి పోటీ ఏర్పడేలా ఉంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఫ్యాన్స్ కలిసి ట్రిపుల్ ఆర్ టీజర్ ను కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ కన్నా ఎక్కువ వ్యూస్ రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అది అంత ఈజీగా అయ్యే పనేమి కాదు.

ఓ పక్క ఆచార్య సినిమా టీజర్ ను కూడా బీభత్సమైన వ్యూస్ రాబట్టాలని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరి ఈ రెండు టీజర్లు ఒకేసారి రిలీజైతే మాత్రం అంతర్జాలం షేక్ అవడం ఖాయం. సినిమాల రిలీజ్ ల పోటీ అటుంచితే ట్రిపుల్ ఆర్, ఆచార్య టీజర్ ల మధ్య పోటీ మాత్రం రసవత్తరంగా మారనుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: