మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో క్రేజీగా వస్తున్న సినిమా గని. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. గని పాత్రలో సీరియస్ లుక్ లో వరుణ్ తేజ్ సర్ ప్రైజ్ చేశాడు. బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాగా కష్టపడ్డాడని అనిపిస్తుంది. సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్న వరుణ్ తేజ్ సినిమాలో తన బాక్సింగ్ తో అదరగొడతాడని అంటున్నారు.

గని మోషన్ పోస్టర్ రిలీజ్ అవగానే మెగా హీరోలతో పాటుగా అల్లు అర్జున్ కూడా ఈ  సినిమాకు బెస్ట్ విషెష్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ వరుణ్ తేజ్.. గని పంచ్ సూపర్ అని ట్వీట్ చేశాడు. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న అల్లు బాబికి, సిద్ధుకి బెస్ట్ విషెష్ అందించారు అల్లు అర్జున్. మెగా ప్రిన్స్ నటిస్తున్న గని సినిమా అల్లు అరవింద్ పెద్దబ్బాయ్ అల్లు బాబి నిర్మాతగా చేస్తున్న సినిమా అన్నమాట. అందుకే ఈ సినిమాకు అల్లు వారి స్పెషల్ ప్రమోషన్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

రొటీన్ సినిమాలతో కాకుండా తన మార్క్ కనిపించేలా కొత్త కథలతో వస్తున్న వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ స్క్రీన్ నేం తో సత్తా చాటుతున్నాడు. ఆల్రెడీ ఎఫ్2, గద్దలకొండ గణేష్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న వరుణ్ తేజ్ గనితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.                                                    



మరింత సమాచారం తెలుసుకోండి: