ఇక ఈ సినిమా ట్రైలర్ ను అబ్సర్వ్ చేస్తే మాత్రం ప్రదీప్ ఈ సినిమాలో హీరోయిన్ అమృత అయ్యర్ తో లిప్ లాక్ కానిచ్చాడు. ప్రదీప్ హీరోగా చేస్తున్న మొదటి సినిమాలో యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే అన్ని పాయింట్స్ ఉంచాడని తెలుస్తుంది. ఇక రెడ్ సినిమాతో అమృత అయ్యార్ ఆల్రెడీ తన ఖాతాలో ఓ హిట్ వేసుకుంది ఇక ఇప్పుడు ఈ సినిమాతో తను రెండో హిట్ కొట్టాలని చూస్తుంది. ప్రదీప్, అమృత అయ్యార్ ఇద్దరి జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.
రెండు జన్మల ప్రేమకథగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా వస్తుంది. ఈ సినిమాతో ప్రదీప్ సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అంతకుముందు హీరో పక్క చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ప్రదీప్ ఈసారి హీరోగా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. సినిమా రిలీజ్ అవడానికి ముందే నీలి నీలి ఆకాశం సాంగ్ పెద్ద హిట్ అవడంతో సినిమా కూడా అదే రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి