అలా ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా మారి తమ హవా చాటుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే సహజ సౌందర్యం వేరు, ఆ సౌందర్యానికి మేకప్ అనే మెరుగులు దిద్దిన తర్వాత కనిపించే మోము వేరు. ఇది వాస్తవం హీరోయిన్స్ అందంగానే ఉంటారు. కానీ, ఒక్కసారి వారి ఒంటిపై మేకప్ పడితే చాలు వారి అందం డబుల్, త్రిబుల్ గా పెరిగి మరింత అందంగా తయారవుతారు. వాళ్లు అద్దంలో చూసుకున్నప్పుడు ఇది నేనేనా అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. వారి సహజ సౌందర్యానికి మేకప్ మరింత వన్నె తీసుకొచ్చి వాళ్లని వెండితెరపై అద్భుతంగా కనిపించేలా చేస్తుంది.
ఇలా ఎంతో మంది హీరోయిన్లు వెండి తెరపై కాకుండా మేకప్ లేనప్పుడు చూస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తారు. చాలా వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారి అందానికి మేకప్ తోడైతే ఒక అద్భుతమనే చెప్పాలి. అందుకే ఆడవారికి మేకప్ అంటే అంత ఇష్టం. ఇది సినీ పరిశ్రమలో చాలా కీలక పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు కొందరు హీరోయిన్ల మేకప్ ఉన్నప్పుడు మేకప్ లేనప్పుడు ఉన్న ఫోటో లను చూద్దాం... తేడా ఏమిటో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇందులో ప్రియాంక జవాల్కర్ సాధారణంగా మేకప్ లేకుండా ఎలా ఉందో చూడండి..అసలు గుర్తు పట్టలేరేమో...! అదేవిధంగా కేరళ కుట్టి నివేద థామస్ కూడా అంతకు ముందు ఎలా ఉంది...ఇప్పుడు సినిమాలలోకి వచ్చిన తరువాత ఎలా ఉందో చూడండి. చూశాక మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి