ప్రస్తుతం నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ చేస్తున్నాడు. షూటింగ్ దాదాపు అయిపోవచ్చిందట. ఆ తరువాత ఓ తమిళ చిత్రం రీమేక్ లో నటించనున్నాడు. దానికా షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఈ రెండూ పూర్తయ్యాక ‘పిల్ల జమిందార్’ దర్శకుడితో చిత్రం ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
‘పిల్ల జమిందార్’ చిత్రంతో దర్శకుడిగా అశోక్ కి మంచి మార్కులే పడ్డాయి. అశోక్ ప్రస్తుతం సాయికుమార్ తనయుడు ఆదితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత నాగచైతన్య చిత్రం పనిలో పడతాడని టాక్. చైతూ కూడా నాన్నలానే చకచకా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: