రామ్ చరణ్ హీరోగా , కృష్ణ వంశీ దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం గోవిందుడు అందరివాడేలే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ రావడంతో, అన్ని చోట్ల నుండి మూవీ కలెక్షన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా రాంచరణ్ చరణ్ కెరీర్లోనే భారీ ప్రీమియర్ కలెక్షన్స్ అని నిరూపించింది. అలాగే మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 9 కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేయడంతో, ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది.
దీంతో రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం లాభాలను కురిపించడం ఖాయం అని అంటున్నారు. ఇదిలా ఉంటే మొదటి రోజు భారీ కలెక్షన్స్ తో సత్తా చాటిన గోవిందుడు అందరివాడే మూవీ, రెండో రోజు కూడ అదే ఊపుని కొనసాగించింది. రెండో రోజు కలెక్షన్స్ సైతం 8.50 కోట్ల రూపాయలుగా ఉండటంతో ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ కలుపుకొని దాదాపు 18 కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేసింది.
ఈ వారంలో దసర, బక్రీద్, ఇతర సెలవులతో దాదాపు అన్ని ఆఫీసులు మూతపడి ఉన్నాయి. దీంతో ఈ ఎఫెక్ట్ గోవిందుడు అందరివాడేలే మూవీ బాక్సాపీస్ కి బాగా కలిసి వచ్చే అవకాశం అని అంటున్నారు. మొత్తంగా రామ్ చరణ్, గోవిందుడు అందరివాడేలే మూవీ సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: