టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోలుగా మంచి పేరు ప్రఖ్యాతలతో కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉంటారు. ఇక వీరిద్దరూ గత ఏడాది ఒకేసారి తమ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాలు రెండూ గత ఏడాది సంక్రాంతి కానుకగా కేవలం ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అయి రెండూ కూడా మంచి సక్సెస్ సాధించాయి.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తుండగా, అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై సర్కారు వారి పాట మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతుండగా మూడు రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ ని దుబాయ్ లో ప్రారంభించారు. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమాని ఈ ఏడాది ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నాం అంటూ నేడు యూనిట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట మూవీ ఆయన జన్మదినం సందర్భంగా ఆగష్టు 9 న రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే దానిపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇదే కనుక జరిగితే మరొక్కసారి బాక్సాఫిస్ బరిలో అటు మహేష్, ఇటు అల్లు అర్జున్ నిలిచే అవకాశం గట్టిగా కనబడుతోంది. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: