యువ హీరో అక్కినేని నాగ చైతన్య మజిలీ, వెంకీమామ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాసినిమా రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అందుకే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో భారీ డీల్ సెట్ చేసుకున్నారట. లవ్ స్టోరీ డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ తో కలిపి మొత్తం 16 కోట్లకు డీల్ కుదిరిందట. సినిమా బడ్జెట్ మొత్తం ఈ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలోనే రావడం విశేషం. ఇక నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్ తో వచ్చేది అంతా లాభమే అని చెప్పొచ్చు. ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఉగాది సందర్భంగా వస్తున్న ఈ సినిమాకు పోటీగా నాని టక్ జగదీష్ రిలీజ్ అవుతుంది.

నాని, నాగ చైతన్యల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది. రెండు హిట్ సినిమాలతో చైతు, వి సినిమా తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో నాని ఇద్దరు ఒకేరోజు వస్తున్నారు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీష్ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుల మనసులు గెలుస్తుందో చూడాలి.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: