ఇక కపటదారి వసూళ్ల విషయానికి వస్తే ‘కపటదారి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకూ ఈ చిత్రాన్ని నిర్మాతలు ఒన్ రిలీజ్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే.. రూ.2.2కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 0.36 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 1.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇంత ఘోరమైన ఓపెనింగ్స్ తో వీకెండ్స్ లో ఈ చిత్రం నిలబడుతుందని ఏమాత్రం నమ్మకం లేదు.
సుమంత్ ఈ సారి కూడా నిరాశపరిచాడు. కనీసం డబ్బింగ్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లలో సగం కూడా ఈ చిత్రానికి నమోదు కాలేదు అంటే సుమంత్ బ్యాడ్ ఫామ్ కి.. ఇది నిదర్శనం అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి