
మనీ మనీ, గులాబీ, అనుకోకుండా ఒక రోజు, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయరా, సత్య వంటి హిట్ చిత్రాల్లో నటించి కొద్దీ రోజుల్లోనే అయన స్టార్ అయిపోయాడు. హీరోగా చేస్తున్న టైం లోనే ప్రత్యేక పాత్రలు, గెస్ట్ పాత్రలు చేసి చక్రవర్తి ఎన్నో ప్రయోగాలు చేశారు. కాలక్రమేణా అయన ప్రాభల్యం తగ్గుతూ రావడంతో అయన నటనకు కామా పెట్టి దర్శకత్వం చేపట్టారు. అయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని బాగానే ఉన్నా కమర్షియల్ గా ఆడలేదు.. దాంతో ఆ ఆలోచన పక్కనపెట్టి మళ్ళీ నటిస్తున్నారు. ఈమధ్యే హిప్పీ అనే చిత్రంలో మెప్పించిన అయన తమిళ, కన్నడ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు..
ఫామిలీ లైఫ్ ని బయట చెప్పుకోవడానికి ఎక్కువ గా ఇష్టపడని జేడీ 2016 లో లక్నోకి చెందిన అనుకృతి గోవింద్ శర్మని వివాహం చేసుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన శ్రీదేవి సినిమాలో అనుకృతి నటించింది. పైగా ఈ సినిమాకి జె.డి.చక్రవర్తి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదట. కానీ వీరిద్దరూ ఒకటయ్యారు. ఆ తర్వాత ఆమె సినిమాలు మానేసింది.. అయితే జేడీ చక్రవర్తి అభిమానులు మాత్రం చక్రవర్తి మంచి మంచి పాత్రలతో కం బ్యాక్ చేయాలనీ కోరుకుంటున్నారు.. మరి ఆయనకు ఓ మంచి సినిమా పడుతుందా చూడాలి..