వినాయక్ దగ్గరే పని చేస్తున్నపుడు బోయపాటి శ్రీను భద్ర కథను ముందు అల్లు అర్జున్.. ఆ తర్వాత జూనియర్‌కు చెప్పాడు. కానీ కుదర్లేదు. వెంటనే అదే కథను రవితేజకు చెప్పి ఓకే చేయించుకుని హిట్ కొట్టాడు బోయపాటి. సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయిన అతనొక్కడే కథను ముందుగా ఎన్టీఆర్‌కు చెప్పాడు.. అయితే అది అనుకోకుండా కళ్యాణ్ రామ్ దగ్గరికి వచ్చి అతన్ని హీరోగా, నిర్మాతగా నిలబెట్టింది.
అశోక్, అతిథి లాంటి ఫ్లాపుల తర్వాత సురేందర్ రెడ్డి కిక్ కథను ఎన్టీఆర్‌కు వినిపిస్తే అది ఆయన వదిలేసాడు.. ఆ తర్వాత రవితేజ చేస్తే బ్లాక్‌బస్టర్ అయింది. వివి వినాయక్‌తో ఎన్టీఆర్‌కు చాలా అనుబంధం ఉంది. ఆ రిలేషన్‌తో కృష్ణ కథ వినిపిస్తే ఎందుకో కానీ జూనియర్‌కు కనెక్ట్ కాలేదు. కానీ అదే రవితేజకు బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. బృందావనం సినిమాకు కలిసి పని చేసిన అనుభవంతో కొరటాల శివ వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌కు శ్రీమంతుడు కథ చెప్పాడు కానీ ఆయన చేయలేదు.. అదే సినిమా మహేష్ బాబు చేస్తే ఇండస్ట్రీ హిట్ అయింది.
వంశీ పైడిపల్లి ముందు నాగార్జున, ఎన్టీఆర్ హీరోలుగా ఊపిరి సినిమా అనౌన్స్ చేసాడు. అయితే అందులో నాగ్ కాళ్లు పట్టుకోవాల్సిన సన్నివేశాలు ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వచ్చిందని టాక్. అందుకే ఈ చిత్రం ఆయన తప్పుకున్నాడు.. కార్తి వచ్చాడు. అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాను ముందు ఎన్టీఆర్‌తోనే చేయాలనుకున్నాడు. దిల్ రాజు కూడా ఓకే అన్నాడు.. కానీ చివరి నిమిషంలో రవితేజ వచ్చాడు.. ఆ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఒకవేళ ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ చేసుంటే మాత్రం ఆయన కెరీర్ మరింత హైలో ఉండేదేమో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి