ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అంటే గుర్తిచ్చేది ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. మిర్చి సినిమా తరువాత బాహుబలితో రికార్డు హిట్ కొట్టి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. రెబల్ స్టార్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'మహానటి' లాంటి సినిమా తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయంలా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.పైగా ఇది గతంలో ఎవరూ చూడని సైంటిఫిక్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కావడం విశేషం.దానికోసం రూ.400 కోట్ల బడ్జెట్ ని కేటాయించడంతో.. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు సినిమాకి సంబంధించి కొత్త కబుర్లు చెబుతూనే ఉన్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.తాజాగా తన నిర్మాణంలో తెరకెక్కిన 'జాతిరత్నాలు' సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాతో ముచ్చటించారు నాగ్ అశ్విన్.ఈ క్రమంలో ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.


నిజానికి ప్రభాస్ సినిమాను గతేడాది జూన్ లోనే మొదలుపెట్టాలని అనుకున్నామని.. కానీ కరోనా వలన ఆలస్యమైందని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పట్టేలా ఉండడంతో ఇంకా ఆలస్యంగా సినిమాను మొదలుపెడుతున్నామని చెప్పారు. ఏడాదికి పైగా సమయం పనుల కోసం కేటాయిస్తున్నామని.. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సి ఉందని నాగ్ అశ్విన్ తెలిపారు.'మహానటి' సినిమాలో వాడిన పాత కార్లు లాంటివి తెప్పించడం పెద్ద కష్టం కాదని.. కానీ ప్రభాస్ తో తాను చేయబోయే సినిమాలో వాడే వాహనాలు ఎక్కడా దొరకవని.. వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నామని చెప్పారు. ఒక్క వాహనాలు మాత్రమే కాదని.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీదీ ఆర్ట్ డిపార్ట్మెంట్ తో తయారు చేయిస్తున్నట్లు తెలిపారు.


స్క్రిప్ట్ తో సహా సినిమాలో ప్రతీదీ కొత్తగానే ఉంటుందని.. ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తామని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జూన్-జూలై నెలలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని మొదలుపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.ఈ సినిమా గతంలో ఎవరు కనివిని ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని కలిగించడం ఖాయమట. చూడాలి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో....

మరింత సమాచారం తెలుసుకోండి: