
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలతో దూసుకుపోతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్. ఇప్పటి వరకూ సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రాలు అన్నీ ఓ సాధారణ హిట్ గానే నిలిచాయి. ఇక తను తాజాగా నటించిన “సుబ్రమణ్యం ఫర్ సేల్” మూవీ బాక్సాపీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాదించిందనే చెప్పాలి.
కథ పరంగా లాజిక్ లు లేని మిస్టేక్స్ మూవీలో ఎన్నో ఉన్నప్పటికీ, ప్రేక్షకులను మాత్రం“సుబ్రమణ్యం ఫర్ సేల్” మూవీ అలరిస్తుంది. ఇధిలా ఉంటే“సుబ్రమణ్యం ఫర్ సేల్” మూవీ మొదటి రోజు 90 శాతం ఆక్యుపెన్సీతో థియోటర్స్ లో ప్రదర్శించబడింది. దీంతో ఎన్నడూ లేనంతగా సాయిధరమ్ తేజ్ మూవీకి కలెక్షన్స్ ఎక్కువుగా వసూల్ అయ్యాయి.
ఇక “సుబ్రమణ్యం ఫర్ సేల్” మొదటి కలెక్షన్స్ వివరాలను చూస్తే, తెలంగాణలో ఈ మూవీ 5.1 కోట్ల రూపాయలను వసూల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రలో 2.3 కోట్ల రూపాయలు వసూల్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సైతం కలుపుకుంటే“సుబ్రమణ్యం ఫర్ సేల్” మూవీ మొదటి రోజు కలెక్షన్స్ 8 కోట్ల రూపాయలను టచ్ చేసినట్టుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీలలో భారీ ఓపెనింగ్స్ తెచ్చిన మూవీగా“సుబ్రమణ్యం ఫర్ సేల్” నిలిచింది. కొన్ని సీన్స్ లో కామెడీ పేలటంతో ప్రేక్షకులు కొద్దిగా రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఇక మెగాహీరో అనే ప్లేవర్ తో ప్రేక్షకుల్లోకి వెళ్లింది కాబట్టి, ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు.