తాను మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని అని చెప్పుకోవడానికి పవన్ తేజ్ గట్టిగానే ప్రయత్నించాడు. చిరంజీవి పవన్ కళ్యాణ్‌లను ఇమిటేట్ చేయడం పాత సినిమాల్లో చిరంజీవిలా ఉన్నావంటూ డైలాగ్ పెట్టించుకోవడం లాంటివి చేసినా మెగా ఫ్యామిలీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. దీనికితోడు ఈ హీరో లుక్స్ కూడ అంతంత మాత్రంగా ఉండటంతో మెగా అభిమానులు కూడ ఇతడిని చాల లైట్ గా తీసుకున్నారు.
ఇలాంటి హీరో నటించిన సినిమాను ప్రమోట్ చేస్తే తమ మెగా ఫ్యామిలీ బ్రాండ్ వ్యాల్యు పడిపోతుందని భావించారో లేదంటే మరేదైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ ఈ యంగ్ హీరో గురించి మొత్తం మెగా ఫ్యామిలీ అమ్త్హా వ్యూహాత్మక మౌనం పాటించింది. అంతేకాదు తాను పవన్ కళ్యాణ్ ఇచ్చిన షర్టు వేసుకున్నాను అంటూ చెప్పినా సోషల్ మీడియాలో ఇతడిని పట్టించుకోకుండా కొంతమంది ఇతడి పై జోక్స్ మీమ్స్ వేసారు.
రెండు భారీ సినిమాల మధ్య ఈ చిన్న సినిమా విడుదలైన పరిస్థితులలో ఈ సినిమాకు కనీస స్థాయిలో కూడ ప్రేక్షకులు ధియేటర్ల వద్దకు రాలేదు అని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ అంగీకరించినా అంగీకరించపోయినా మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల లిస్టులో మరో హీరో వచ్చి చేరిపోయాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి