కేవలం సినిమాల్లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ అభిమానులందరినీ కూడా పగటి కలల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం కెరీర్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది రాధిక . అయితే బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న మిస్సెస్ అండర్ కవర్ అనే సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పై త్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో రాధికా ఆప్టే పాత్ర గృహిణిగా ఉండబోతుందట.. ఓవైపు గృహిణిగా ఉంటూనే కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు ఇక మోసగాళ్ళ అంతు చూడటానికి నేరస్తుల భరతం పట్టడానికి అండర్ కవర్ కాప్ గా కూడా పని చేస్తూ ఉంటుందట రాధిక ఆప్టే. ఇలా ఓవైపు గృహిణిగా మరోవైపు అండర్ కవర్ కాప్ గా కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో అనుశ్రీ మమత దర్శకురాలిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం కానుంది. కొత్త దర్శకురాలు అయినప్పటికీ కథలో కొత్తదనం ఉండడంతో ఇక ఈ సినిమా చేసేందుకు రాధిక ఆప్టే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి