అలాంటి చరణ్.. పవన్ కు కరోనా సోకితే ఊరుకుంటాడా..! నిజానికి కరోనా సోకితే ఫ్యామిలీ మెంబెర్స్ కూడా త్వరగా దగ్గరకు రారు. అయితే చరణ్ మాత్రం పవన్ కు కరోనా సోకిందని తెలిసిన వెంటనే..తన బాబాయ్ ని చూడటానికి వచ్చాడు.అతను చికిత్స పొందుతోన్న శంకరపల్లికి చేరిపోయాడు. శంకరపల్లిలో పవన్ తన ఫార్మ్ హౌస్లోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అయినప్పటికీ చరణ్..తన భార్య ఉపాసన సాయంతో అపోలో వైద్యుల చేత పవన్ కు సరైన వైద్యం అందేలా చూస్తున్నాడు చరణ్. గంట గంటకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ లను అపోలో వైద్యులు చరణ్ కు చెబుతున్నారట. అంతేకాదు పవన్ కోసం 'ఆచార్య' లో తన పార్ట్ షూటింగ్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేసాడట చరణ్. ఏప్రిల్ 20వరకూ జరగాల్సిన పాట చిత్రీకరణను చరణ్ ఆపేసాడట.ఇక పవర్ స్టార్ పట్ల చరణ్ కి వున్న ప్రేమని చూసి పవర్ స్టార్ అభిమానులు చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మా చరణ్ బాబు మా అన్న పవర్ స్టార్ కి ఎంత ప్రేమో అని మురిసిపోతున్నారు పవన్ అభిమానులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి