
కరోనా కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా సాగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. 45యేళ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నారు. మే1 నుంచి 18యేళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందరికీ టీకా చేయిస్తామని ప్రకటించింది. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్‌పై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. వ్యాక్సిన్‌పై విస్తృత ప్రచారం కల్పిస్తుంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్‌బాబు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు తెలిపారు. నేను కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నానని, దయచేసి మీరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోండి అంటూ మహేష్‌బాబు తన అభిమానులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ద్వారానే కరోనాను అడ్డుకోగలమని మహేష్ తెలిపారు. 18ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హత ఉన్న వారందరూ మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ మహేష్‌బాబు పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే కరోనా టీకాకోసం ముందుగా కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏప్రిల్ 28నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ డోస్ కోసం ఆటో మేటిక్ గా షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది.