బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు రేటింగ్ తో టాప్ లో నిలుస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకూ సాయంత్రం ఏడున్నర అయ్యిందంటే చాలు సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకూ బుల్లితెర ముందు హాజరవుతున్నారు. అవును ఆ సమయంలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ కోసం అంతగా ఎదురుచుస్తున్నారు ప్రేక్షకులు.

ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబులు అంతగా తెలుగు లోగిళ్ళలో దూసుకుపోయారు. సౌందర్య, హిమ, శౌర్య, మోనిత, ఆదిత్య నుంచి పనిమనిషి వరకూ ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. అందుకే మా టివిలో పాపులర్ గా మారి, విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ గా నిల్చింది. ఈ సీరియల్ లో అలరిస్తూ వంటలక్కగా గుర్తింపు పొందిన దీప కీలక పాత్ర అయింది. ఈమెను చూడగానే తెలుగు అమ్మాయి అనుకుంటాం. కానీ ఈమె కేరళకు చెందిన భామ. ఈమె పేరు ప్రేమీ విశ్వనాధ్. మలయాళంలో ఈమె కొన్ని సీరియల్స్ చేసింది.

అయితే మలయాళంలో నటించిన సీరియల్ లో నల్లటి అమ్మాయిలా నటించి అందరి మనసు దోచుకుంది. రెండు అవార్డులు వచ్చాయి. తెలుగులో మాత్రం ఇది దీపకు తొలి సిరియల్. ఈ సీరియల్ దీప నటనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఫలితంగా ఈ సీరియల్ కి మంచి పేరు వచ్చేసింది. ఇక టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో దీప పాత్రకు ప్రేమీ విశ్వనాధ్ కన్నా ముందు వరూధిని పరిణయం సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న చందన శెట్టి ని అడిగారట. ఆ సీరియల్ లో ఆమెకు మంచి పేరు వచ్చింది. జ్యోతి సీరియల్ లో నటిస్తున్న చందన మోడలింగ్ లో కూడా దూసుకెళ్తోంది. అయితే కార్తీకదీపం సీరియల్ ని కొన్ని కారణాల వలన మిస్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: