దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి భారినపడే వారి సంఖ్య రోజు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై కూడా బాగానే ఉంది. సినిమా షూటింగ్స్ పాల్గొన్న పలువురు దర్శకులు, నటులు కరోనా బారిన పడ్డారు. దీంతో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. షూటింగ్స్ వాయిదా పడటంతో సినీ హీరోలు ఇంటికే పరిమితమైయ్యారు. ఇక న్యాచురల్ స్టార్ నాని కూడా ఇంట్లోకే పరిమితమైయ్యారు.

ఇక నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నజ్రియా హైదరాబాద్ నగరంలో కేసులు పెరగడంతో షూటింగ్ కు ప్యాకప్ చెప్పి వెళ్లిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి.



అయితే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇంటికే పరిమితమైన నాని కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.కొడుకుకు కబుర్లు చెబుతూ, ఆటలు ఆడుతూ ఆ వీడియోలను నాని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. కొడుకు అర్జున్ తో కలిసి నాని ఆడుకుంటూ హంగామా చేస్తున్నారు.అర్జున్ క్యూట్ గా మాట్లాడిన మాటలకు నెటిజన్లు ఫిదా కావడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.


స్టార్ హీరోయిన్ సమంత నాని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోను చూసి లవ్ ఎమోజీలను కామెంట్ గా పెట్టడం గమనార్హం. మరోవైపు నాని ఈ ఏడాది కనీసం 3 సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. టక్ జగదీష్ మూవీకి ఓటీటీ ఆఫర్లు వస్తున్నా నాని మాత్రం ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. నాని నటించిన సినిమాలలో ఎన్ని సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదలవుతాయో చూడాల్సి ఉంది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా నానికి వరుస ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: