మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. అప్పటినుంచి ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. కొన్ని సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా ట్రై చేయించాలని ప్రయత్నించిన అది వర్క్ అవుట్ కాలేదు..కానీ శేఖర్ కమ్ముల కథకి ఫిదా అయ్యి సాయి పల్లవి ఫిదా సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరిని తొలి సినిమా తోనే ఫిదా చేసింది.. ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు..
ఈనేపథ్యంలో ఆమె నెలకొల్పిన కొన్ని రికార్డ్స్ ఎవరు చేరుకోలేని విధంగా ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించిన 'మారి-2' చిత్రంలోని 'రౌడీ బేబీ' సాంగ్ 1.14 బిలియన్ల వ్యూస్ దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే' సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా 'సారంగదరియా' సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్ లో ఒక హీరోయిన్ సాంగ్స్ కు ఇంతటి ఆదరణ రావడం బహుశా ఇదే మొదటిసారేమో.. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి