పవన్ కళ్యాణ్ కు సినిమాలలో నటించడమే కాకుండా సినిమా నిర్మాణానికి సంబంధించిన అనేక టెక్నికల్ విభాగాలతో పరిచయం ఉంది. దీనికితోడు పవన్ ఒక మూవీ కథను తనకు చెప్పగానే ఆమూవీ హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అన్న విషయం వెంటనే చెప్పేస్తాడు అని అంటారు.


దీనితో పవన్ కు కథ చెప్పే విషయంలో దర్శకుడు ఆచితూచి వ్యవరించవలసిన పరిస్థితి. పవన్ ఒక సినిమా కథ నచ్చక ఆ సినిమాలో నటించను అని అంటున్నా వినిపించుకోకుండా పవన్ ను బ్రతిమాలిన ఒక ప్రముఖ డైరెక్టర్ కు సంబంధించిన విషయాలను పవన్ సన్నిహితుడు ఆనంద సాయి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమధ్య తెలియచేసాడు.


‘ఖుషీ’ మూవీ తరువాత పవన్ కు వరసగా ఫ్లాప్ లు రావడం మొదలయ్యాయి. అలాంటి పరిస్థితులలో నిర్మాత ఏ.ఎమ్. రత్నం పవన్ తో ఒక సినిమా తీయడానికి ప్రయత్నిస్తూ ప్రముఖ తమిళ దర్శకుడు ధరణి ని పవన్ దగ్గరకు పంపాడట. అతడు కథ చెప్పగానే ఈ మూవీ కథలో అనేక లోపాలు ఉన్నాయని ఈ మూవీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని అందువల్ల ఈ మూవీ తీయవద్దు అంటూ అప్పట్లో పవన్ ధరణి కి స్పష్టంగా చెప్పాడట.


ఆమాటలు ధరణి వినిపించుకోకుండా పవన్ చేతులు పట్టుకుని తాను పవన్ కాళ్ళు పట్టుకున్నట్లుగా భావించమని అడగడంతో మొహమాటస్తుడైన పవన్మూవీ చేసాడట. ఆమూవీ పేరు ‘బంగారం’ పవన్ సినిమాల ఫ్లాప్ లిస్టులో అది కూడ చేరిపోయింది. దీనితో ‘బంగారం’ ఫెయిల్యూర్ ను పవన్ కళ్యాణ్ ముందే ఊహించాడు అంటూ ఆనంద సాయి ముందుగానే ఊహించాడు. అయితే ఒక సినిమా కథ పై పూర్తి అంచనాలు ఉన్న పవన్ ఆతరువాత ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ లాంటి ఫెయిల్యూర్ సినిమాల కథలను ఎందుకు ఎంచుకున్నాడు అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది..



మరింత సమాచారం తెలుసుకోండి: