వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఎపుడూ ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు. సినిమా, రాజకీయ, వైరల్ ఇలా ఏ అంశమైనా ఆర్జీవి తనదైన రీతిలో స్పందిస్తుంటారు. సినిమాల విష‌యానికొస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్, బాల‌క్రిష్ణ‌, నాగ‌బాబుల‌పై ఆర్జీవీ సెటైర్లు వేస్తుంటారు. అయితే ఆర్జీవీ సెటైర్ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా నాగ‌బాబు మాత్రం దానికి త‌గ్గ‌ట్టుగా స్ట్రాంగ్ కౌంట‌ర్ లు వేస్తుంటారు. అయితే కరోనా విజృంభణ సమయం నుండీ ఆర్జీవి హీరోలు ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. కరోనా వైరస్ పై అలాగే వైరస్ ను కట్టడి చేయడం లో విఫలమైన ప్రభుత్వాలపైనే తనదైన రీతిలో  స్పందిస్తున్నారు. ముఖ్యంగా మోడీ టార్గెట్ గా ఆర్జీవి ట్విట్టర్ లో రోజుకో పోస్ట్ పెడుతున్నారు. అంతే కాకుండా ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడగా...పవన్ ఫోటోలు షేర్ చేస్తూ ఆర్జీవి సెటైర్లు వేశారు. దాంతో పవన్ అభిమానులు ఆర్జీవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా తాజాగా వర్మ నట సింహం నందమూరి బాలకృష్ణ జోలికి వచ్చారు. రంజామ్ పండగ సందర్భంగా బాలయ్య ముస్లిం సోదరులు పంగడ రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఉదయం నుండి ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అదే వీడియోను షేర్ చేసిన వర్మ ముందు అల్లా హూ అక్బర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతే కాకుండా మరోసారి అదే వీడియోను షేర్ చేసి "బుల్లా హు బుల్ బుల్" అంటూ షేర్ చేశారు. ఇక బాలయ్య సెటైర్లను కొంతమంది నెటిజెన్లు ఎంజాయ్ చేస్తుండగా బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు. దమ్ముంటే బాలయ్య ముందుకెళ్లి ఆ మాట చెప్పాలని అంటున్నారు. ఇక మరికొంతమంది ఎన్ని పెగ్గులేసి మొదలెట్టావ్ వర్మ.. .ఇది మా కర్మ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: