లవర్ బాయ్‌గా ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అతికొద్ది మంది యువ హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. అతని సినిమాలకు అప్పట్లో అమ్మాయిలు థియేటర్స్ వద్ద క్యూ కట్టేవారు. అబ్బాయిలు కూడా అతని సినిమాల కోసం ఎగబడేవారు. అంతలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఎలాంటి సినిమా చేసినా ఉదయ్ కిరణ్ ప్రాణం పెట్టి చేసేవాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టేవాడు కాదు. నువ్వు నేను లాంటి హిట్ సినిమా తరువాత కూడా అందరిలాగే ఓకేసారి రెమ్యునరేషన్ పెంచలేదు. ఇచ్చిన కమిట్మెంట్స్ కారణంగా చాలా సినిమాలకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే సంతోషపడ్డాడు. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చగా నడిచింది.
ఉదయ్ కిరణ్ కెరీర్ కొంత స్టో అయిన స్టేజ్‌లో ఓ మల్టీస్టారర్ స్టోరీ అతడి వద్దకొచ్చింది. అదే రవిబాబు డైరెక్ట్ చేసిన సోగ్గాడు. ఈ సినిమా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే అమ్మాయిని లవ్ చేస్తుంటారు. అందులో తరుణ్, ఉదయ్ కిరణ్‌లను హీరోలుగా పెట్టాలని రవిబాబు అనుకున్నాడట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి