టాలీవుడ్ లో వివాదస్పద దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. ఆయన ఏమి చేసిన ఒక రచ్చ జరగాలిసిందే.ఎవరు ఏమనుకున్నా నాకేంటి నేను ఇంతే అనే మనస్తత్వం కలవాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ విషయంలో జనాల్లో హాట్ టాపిక్ గా మారతాడు.ఎదుటి వాళ్లు ఎంతటివారైన సూటిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ తెలుగులోనే అనేక సినిమాలు కాకుండా బాలీవుడ్‌లో కూడా పలు సనిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. ఆయన తీసిన కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా కూడా నిలిచాయి. ఆ సినిమాల్లో రంగీలా సినిమా కూడా ఒకటి. జాకీ ష్రాఫ్‌, ఊర్మిళా మటోండ్కర్‌ కలిసి హీరో హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ మూవీలో ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు.కానీ ఈ సినిమా తర్వాత ఆమిర్‌ ఖాన్‌కు, ఆర్జీవీకి మధ్య కొన్ని అభిప్రాయ విభేదాలు తలెత్తినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.



రంగీలా మూవీ సక్సెస్‌ తర్వాత ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో.. ఈ మూవీలో ఆమిర్‌ ఖాన్ నటన కంటే వెయిటర్‌ నటన బాగుంది అనే వ్యాఖ్యలు చేశాడని వార్తలు వచ్చాయి. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అలా కొన్ని రోజుల పాటు తాము మాట్లాడుకోలేదని ఆర్జీవీ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.ఆర్జీవి మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య మాటల విబేధాలు వచ్చినప్పుడు నేను అమిర్‌ ఖాన్ తో వెంటనే మాట్లాడేందుకు అప్పట్లో ఫోన్లు లేవు. అప్పట్లో ఫోన్లు లేకపోవడం వల్ల మేమిద్దరం వెంటనే పరిష్కరించుకోలేకపోయాం.



అప్పటికే ఆ వార్త విన్న ఆమిర్‌ నన్ను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టసాగాడు. ఆ తర్వాత ఒకరోజు ఇద్దరం కలుసుకుని అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకున్నాం' అని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమిర్‌ మంచి నటుడని,గొప్ప అంకిత భావంతో ఉంటాడని ఆర్జీవీ అన్నారు. అలాగే అమీర్ ఖాన్ కి ఓపిక కూడా చాలా ఎక్కువ అని నటుడిగా ఆయనకు పతనం లేదంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అసలు ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిన మేటర్ రాయకుండా ఆమిర్‌ కంటే వెయిటర్‌ ప్రదర్శన బెటర్‌ అనే శీర్షికతో ఆర్టికల్‌ వేశారు' అంటూ అసలు విషయం వివరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: