ప్రేక్షకులు అన్ని జోనర్ల సినిమాలు చూడడానికి ఇష్టపడతారు.. యాక్షన్, కామెడీ చిత్రాలతో పాటు హారర్ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు కానీ ఎంతో భయపడుతుంటారు.. కొంతమంది ఈ సినిమాలు చూడడానికి భయపడుతున్న కూడా కళ్ళు మూసుకుని చూస్తూ వారు ఈవిధంగా సినిమా ని ఎంజాయ్ చేస్తారు. అలా టాలీవుడ్ లో వచ్చిన ఎన్నో హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టాయి.. అలాంటి సినిమాలలోని కొన్ని బాగా భయపెట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ లో అందరిని ఎంతగానో భపెట్టి సూపర్ హిట్ అయినా హారర్ చిత్రం ఛార్మి నటించిన మంత్ర.. ఈ సినిమా చివర్లో దెయ్యం కాదు అన్న ట్విస్ట్ రివీల్ అయి నా ఈ సిని మా క్లైమాక్స్ ని ఇప్పటి కీ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.. అలాగే ఛార్మి నటించిన మంగళ చిత్రం కూడా ప్రేక్షకులను విపరీతంగా భయపెడుతుంది ఈ రెండు సినిమాలలో ఛార్మి నటన అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను భయపెట్టి సూపర్ హిట్ గా నిలిచాయి..

ఇక ప్రేక్షకులను భయపెట్టిన మరో హారర్ సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన దెయ్యం, రాత్రి సినిమాలు .. ఈ సినిమాలు చూసేటప్పుడు ప్రేక్షకులు కనీసం కన్ను కూడా తిప్పనివ్వకుండా చూస్తారు. ఈ చిత్రం ఆరోజుల్లో భారీ బ్లాక్ బస్టర్ లు అయ్యాయి.. ఇక టాలీవుడ్ లో రిలీజ్ అయినా చంద్రముఖి, కాంచన, ముని వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కి గురిచేశాయి.. అలాగే ప్రేమకథ చిత్రం , చంద్రకళ, రాజు గారి గది మూడు పార్ట్ లు, వంటి సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొంది సూపర్ హిట్ గా నిలిచినా చిత్రాలే.. ఇవే కాకుండా గతంలో కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను భయపెట్టి సూపర్ హిట్ గా నిలిచాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: