ఒక వేళ సాయం వద్దనుకున్నవారు డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఈ ఫౌండేషన్ కల్పిస్తోందని చెబుతున్నారు. ఇటువంటి సాయం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అక్షయ్ కుమార్ పలు సేవా కార్యక్రమాలు చేశారు. గతంలో కూడా దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ పై కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. తాను రీల్ హీరోను మాత్రమే కాదు రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయం అందించే సహాయ నిధి పీఎం కేర్స్ ఫండ్‌కి అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 25 కోట్ల భారీ విరాళం అందించాడు. ఆ సమయంలో అక్షయ్ కుమార్ చేసిన సాయం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. దీనితో పలువురు ఆయనను ప్రశంసించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి