స్టార్ డైరెక్టర్ సుకుమార్ విజయ్ దేవరకొండ కామినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు వేరు వేరు ప్రాజెక్టులలో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో ఉండకపోవచ్చు అని ప్రచారం కొద్దిరోజుల క్రితం జరిగింది. అయితే అది నిజం కాదని తమ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సుకుమార్సినిమా కోసం అప్పుడే పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 




పూర్తి తెలంగాణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా లొకేషన్స్ కోసం సుకుమార్ అప్పుడే వేట మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. పూర్తి తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ యాసలో సాగిపోయే ఈ సినిమా షూటింగ్ కూడా తెలంగాణలోనే చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మేరకు సుకుమార్ టీం లొకేషన్స్ వేటలో పడగా సుకుమార్ వాటిని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. నిజానికి పుష్ప సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. 



అప్పటి నుంచి ఖాళీగా ఉండడం ఎందుకని భావిస్తున్న సుకుమార్ ఎప్పటికప్పుడు ఈ సినిమా మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. నిజానికి గతేడాది ఈ సినిమా అనౌన్స్మెంట్ రాగా అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. దీంతో నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక అప్పుడు ఈ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: