ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ ఆమెతో సినిమాలు చేయాలని హీరోలు కోరుకున్నారు అంటే ఆమె వారితో ఎంత కంఫర్టబుల్ గా వర్క్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఆమె నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈమె కూడా సినిమాలు చేయదేమో అన్న భయంతో ఆమె అభిమానులు ఉండగా వారి అనుమానాలను తొలగిస్తూ ఆమె వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టింది
సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై హిట్ గా నిలిచింది. కొన్ని వివాదాలు వచ్చిన ప్రస్తుతం ఆ వివాదాలన్ని సద్దుమణిగి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్. అయితే పెళ్లి తర్వాతనే ఆమె తన గ్లామర్ డోస్ పెంచింది అని అభిమానులు అంటున్నారు. రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ తో ముద్దుసీన్ నుండి అమెజాన్ ప్రైమ్ లోనీ ఫ్యామిలీ మ్యాన్ లోని తన బాడీ అంతా కనిపించేలా చేసిన ఓ సీన్ వరకు ఆమె గతంలో ఎప్పుడూ లేని విధంగా పెళ్లి తర్వాత నే గ్లామర్ షో చేస్తుందని అభిమానులు అంటున్నారు. అక్కినేని కోడలై ఉండి ఇలా చేయడం తప్పు అని అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి