సినీ ఇండస్ట్రీలో చాలా వరకు వారసత్వం కొనసాగడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతే. స్టార్ హీరో, హీరోయిన్ల కిడ్స్ నటీనటులుగా ఎంట్రీ ఇవ్వడం, నిర్మాతలు మరియు డైరెక్టర్ల వారసులు కూడా హీరో, హీరోయిన్ల గానో.. డైరెక్టర్ల గానో ఇలా పలు రకాలుగా సినీ పరిశ్రమలోనే రాణించడానికి చూస్తుంటారు. అయితే ఇదే విధంగా తన వారసులను ఇండస్ట్రీలో కొనసాగిస్తున్న ఓ ప్రముఖ నిర్మాత ఇంట్లో ఆస్తి గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయన వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అందరి సంపాదన ఆస్తిపాస్తులు అన్నీ ఉమ్మడి గానే ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటిని పంచి ఇచ్చేస్తే ఇకపైన నేను సంపాదించినదంతా నాకే చెందుతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎవరికి రావాల్సిన ఆస్తిని వారికి పంచేయండి అంటూ మంకుపట్టు పడ్డాడట స్టార్ హీరో అయిన ఆ నిర్మాత తనయుడు.

కానీ ఆ నిర్మాత మాత్రం అలా కుదరదంటే కుదరదు ఉమ్మడి గానే ఆస్తులు అన్నీ ఉంటాయి అని తెగేసి చెప్పాడట. వేరేగా పంచడం వలన ఇది మన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉంది. అందుకే ఈ ఉమ్మడి ఆస్తిని పంచడం ససేమిరా జరగదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారట . కానీ ఆయన తనయుడు మాత్రం నా సంపాదన ఇకపై ఉమ్మడి ఆస్తిలో కలపడం కుదరదు. మీ మాటతో నేను ఏకీభవించను నా ఆస్తి నాకు పంచాల్సిందే అంటూ భీష్మించుకు కూర్చున్నాడట.

మరో వైపు ఇలా చేయడం నచ్చని కుటుంబ సభ్యులు ఎంతగా అతనికి నచ్చ చెప్పాలని చూస్తున్నా వినిపించుకోవడం లేదట ఆ స్టార్ హీరో. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు ? ఆ స్టార్ హీరో ఎవరు ? అన్న విషయాలు పూర్తిగా బయటకు రాలేదు. కానీ ప్రముఖ నిర్మాత కుటుంబంలో ఈ విధమైన వివాదం తలెత్తినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త ప్రచారమవుతోంది. ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని తలనొప్పులు తెస్తుందో చివరికి ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో తెలియట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: