టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు ముద్దుల మానవడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆయన లాగే గొప్ప స్టార్ హీరో అయ్యాడు.స్టార్టింగ్ నుంచే తన నటనతో ఆకట్టుకొని మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు తారక్.అంతేగాక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా తారక్ కి మంచి బిరుదుంది. తారక్ అంటేనే ఓ సెన్సేషన్ అని చెప్పాలి.డాన్స్, డైలాగ్స్, ఫైట్స్, పెర్ఫార్మన్స్ ఇలా ప్రతి దాంట్లోనూ తన సత్తా చాటి పెద్ద ఆల్ రౌండర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్. కాని ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో సతమతమయ్యాడు తారక్. స్టార్ హీరో  నుంచి మీడియం హీరోగా పడిపోతున్న టైంలో అప్పుడు వచ్చాడు తారక్ ఒక సినిమాతో. ఆ సినిమాతో తారక్ పనైపోయిందనుకునే వాళ్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చి వాళ్ళ నోళ్లు మూయించాడు.ఇక ఆ సినిమా ఏదో ఈపాటికే అర్ధమై ఉంటుంది.అదే "టెంపర్".


ఇక తారక్ గురించి చెప్పాలంటే టెంపర్ కి ముందు ఒక లెక్క టెంపర్ తరువాత ఒక లెక్క అని చెప్పాలి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తారక్ కి మంచి కం బ్యాక్ హిట్ ని ఇచ్చింది. ఇందులో తారక్ ఓ పవర్ ఫుల్ ఆఫీసర్ గా నటించి.. అబ్బ నిజమైన పోలీస్ అంటే ఇలా ఉండాలిరా.. అనిపించాడు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో తారక్ కోర్టు సీన్ లో చెప్పిన డైలాగ్స్ సినిమాని ఒక రేంజికి తీసుకెళ్లాయి.ఆ కోర్టు సీన్ లో తారక్ నట విశ్వరూపం ఏంటో మరో సారి కళ్ళకు కట్టునట్లు చూపించాడు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమా తారక్ కెరీర్ లో మొట్టమొదటి 40 కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ముందు వరుస ప్లాపులతో సతమతమవుతున్న తారక్ కి ఈ సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటికి ఎప్పటికి కూడా ఈ సినిమా తారక్ కెరీర్ లో చిరకాలం గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.అంతే గాక టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ పోలీస్ మూవీస్ లో టెంపర్ కూడా కూడా ఎన్నటికి నిలిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: