తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినీ ఇండస్ట్రీకి లో ఉన్న ఆర్టిస్టులకు ఎంతో సహాయం చేస్తున్నారు. చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే మెగాస్టార్ గా ఎదిగాడు. మెగాస్టార్ తన నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా అందర్నీ అలరించాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎంతో మంది హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి. అంతేకాకుండా చిరంజీవిగారి ఫ్యామిలీ నుండి ఎంతో మంది నటులు వచ్చారు.
ఇక తన తండ్రి కొణిదెల వెంకట్రావు గారు కొన్ని సినిమాలలో నటించారు. ఇక ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
చిరంజీవి తండ్రి వృత్తిపరంగా కానిస్టేబుల్. కానీ తన చిన్నతనం నుంచే నటన పరంగా ఇంట్రెస్ట్ ఉండడంతో అప్పుడప్పుడు స్టేజీపైన నాటకాలు వేసేవారు. కానీ కొన్ని కారణాల వల్ల పూర్తిగా నటుడు కాలేకపోయారు. చిరంజీవి నటుడిగా ఎదగడానికి తన తండ్రి కారణమని చిరంజీవి అప్పుడప్పుడు చెబుతుంటారు.చిరంజీవి గారు హీరో అయ్యాక కూడా తన తండ్రి కొన్ని సినిమాలలో నటించారు..
అది చిరంజీవి గారి సినిమాలోని "మంత్రిగారి వియ్యంకుడు"అనే సినిమాలో ఒక పాత్ర వేశారు. ఈ సినిమాలోనే అల్లు రామలింగయ్య గారితో కలసి చేసిన కొన్ని సీన్స్ కు సంబంధించి కొన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈయన మరో రెండు సినిమాల్లో కూడా నటించారు. కానీ అవి విడుదలకు నోచుకోలేదు. ఇక చిరంజీవి విషయానికి వస్తే, ఆయన ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇక ఆచార్య సినిమాలో తన కుమారుడు రామ్ చరణ్ కూడా నటించడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా  కాజల్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 150 కోట్ల మేరకు జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, లిరిక్స్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: