జూనియర్
ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందిన ఈయన విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆనందింప చేస్తూ ఉంటారు. ముఖ్యంగా
మాస్ హీరోగా,
లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న
జూనియర్ ఎన్టీఆర్ ,ఇక ఆర్ ఆర్ ఆర్
మూవీ లో సరికొత్తగా ప్రేక్షకులను అలరించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శక ధీరుడు
రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ హీరోలైన
రామ్ చరణ్ ,
జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి సంయుక్తంగా నటిస్తున్నారు. ఇక ఇది వరకే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ,కరోనా కారణంగా ఈ సినిమాను 2021
డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు.


ఇదిలా ఉండగా,
జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన 30,31 వ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఆర్ ఆర్ ఆర్
మూవీ తరువాత
జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు
కొరటాల శివ దర్శకత్వంలో ఒక
సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఒక
బాలీవుడ్ నటిని తీసుకోనున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా తన
అన్నయ్య నందమూరి
కళ్యాణ్ రామ్ అలాగే
సుధాకర్ మిక్కిలినేనిలు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక 2022 ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలోకి విడుదల చేయాలని కూడా భావిస్తోంది చిత్రబృందం.

ఇక అయితే ఇప్పుడు మరోసారి
జూనియర్ ఎన్టీఆర్ తన 31వ చిత్రానికి సంబంధించిన
హీరోయిన్ ని కూడా అనుకుంటున్నట్లు సమాచారం.
కొరటాల శివ దర్శకత్వంలో
సినిమా పూర్తవగానే
ప్రశాంతి నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ అలాగే ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
జూనియర్ ఎన్టీఆర్.


ఇక ఈ చిత్రాన్ని 'మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. 'మైత్రి
మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు
హీరోయిన్ గా ఇస్మార్ట్
బ్యూటీ నిధి అగర్వాల్ ను తీసుకోనున్నట్లు ఓవర్సీస్ రైట్స్ వారు తమ అధికారిక
ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం
హీరోయిన్గా ఈమె పేరు వినిపిస్తోందని సమాచారం..