2002 లోనే మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన అందాల నటి రష్మీ గౌతమ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఈ మధ్యలో తన కెరీర్ గురించి ఒక్కసారి తిరిగి చూస్తే కొన్ని సినిమాలలో హీరోయిన్ గానో, పలు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషిస్తూ, ఇటు బుల్లితెరపై షోలలోనూ కనిపిస్తూ అందిన ప్రతి అవకాశాన్ని కాదనుకుంటూ చేసుకుపోతోంది ఈ చిన్నది. వయసు 30 దాటుతున్నా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు, క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ తన కెరీర్ మొత్తం చూసినా ఒక్క బ్రేక్ త్రూ కూడా తనకి అందలేదు. మంచి టాలెంట్, అందానికి అందం, నటనలో మెళుకువలు, స్టార్ హీరోయిన్ లతో సమానంగా ఫాలోయింగ్. అంతేకాకుండా గ్లామర్ గా కనిపించడానికి ఏ మాత్రం వెనుకాడని ఈ హాట్ బ్యూటీ ఇన్నేళ్లు గడుస్తున్నా హీరోయిన్ గా ఎందుకు క్లిక్ అవలేదు అంటే చాలా కారణాలే వినిపిస్తున్నాయి.

2002 లో ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమా ద్వారా సహాయక నటిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయిన రష్మీ గౌతమ్ ఆ తర్వాత బుల్లితెరపై  యువ అనే  సీరియల్లో నటించింది. అయితే ఇక్కడే ఈమె స్టెప్ అంత కరెక్ట్ కాదేమోనని కొందరు అభిమానుల ఫీలింగ్. వాస్తవానికి రష్మీ  హీరోయిన్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే అమ్మాయి. కానీ బుల్లి తెరపై కనిపించడం వలన ఈ ఎఫెక్ట్ తన కెరియర్ పై పడింది అన్నది వారి అభిప్రాయం. వెంటనే సీరియల్ కి ఒప్పుకోకుండా సినిమాలలో మంచి అవకాశం కోసం ఇంకొంత కాలం వెయిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మంచి ఆఫర్లే వచ్చి ఉండేవి అని, అంతేకాక ఈ పాటికి టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో రష్మీ గౌతమ్ పేరు తప్పకుండా ఉండేదని అంటున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వలన ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై రష్మీ దొరికిన అవకాశాలతో సద్దుకోక తప్పలేదు. ఇదే విషయాన్ని  ఆ పాత్రలు ఎందుకు చేశారు అని పలు ఇంటర్వ్యూ లలో రష్మీ ని అడిగితే...అప్పట్లో నా  పరిస్థితుల ప్రభావం వలన అని సమాధానం చెప్పింది.


ఆర్థికంగా కష్టాలలో ఉన్న నేను హీరోయిన్ గా పెద్ద ఆఫర్లు వచ్చేవరకూ వెయిట్ చేసేంత పరిస్థితి లేకపోయింది. అందుకే అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించాను అంటూ అప్పటి విషయాలు షేర్ చేసుకున్నారు రష్మీ. కొన్నిసార్లు కెరియర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న   సమస్యల గురించి చెబుతూ ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రస్తుతం మంచి జోరుర్ధ ఉన్నప్పటికీ సినిమాలో హీరోయిన్ గా స్థిరపడేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూద్దాం ఇకనైనా రష్మీ  హీరోయిన్ గా ఊపందుకుంటుందా లేదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: