పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు నాట కొన్ని లక్షలాది అభిమానులు పవర్ స్టార్ సొంతం. ఇక టాలీవుడ్‌లో పవర్ స్టార్ క్రేజ్ ఏంటనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మెగా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నేళ్లలోనే చిరంజీవి రేంజ్ పాపులారిటీ తెచ్చుకొని అన్నయ్యకు తగిన తమ్ముడుగా దూసుకుపోతున్నాడు పవన్. కేవలం ప్రేక్షకాభిమానులే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్స్ కూడా పవర్ స్టార్ అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక తమ ఫేవరేట్ హీరో, బెస్ట్ పర్సనాలిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెబుతుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా హాట్ హీరోయిన్ సంజన పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మీడియా ఛానెల్‌తో లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ ఆమె వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా సంగతులు, ఫేవరేట్ హీరోలు తదితర సంగతులపై ఓపెన్ అయింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అంటే ప్రాణం అని చెబుతూ ఆయనపై ఉన్న అపారమైన ప్రేమను బయటపెట్టింది. ఇక పవన్ తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానని, నేరుగా పవర్ స్టార్ ని చూడగానే గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పవన్‌ కళ్యాణ్ తో కలిసి పనిచేశాక ఆయన మీదున్న ప్రేమ మరింత పెరిగిందని హాట్ బ్యూటీ సంజన తెలిపింది.ఇక సంజన 2005 సంవత్సరంలో 'సోగ్గాడు' అనే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యింది.. ప్రభాస్ 'బుజ్జిగాడు' సినిమాతో బాగా ఫేమస్ అయింది.ఇక ఆ తర్వాత , సర్దార్ గబ్బర్ సింగ్, అవును2, 2 కంట్రీస్ లాంటి సినిమాల్లో నటించినా వాటితో ఆమె పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి తిరిగి విడుదల అవ్వడంతో సంజన పేరు దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: