అయితే ఈ మూవీలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. పుష్ప సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కిస్తున్నారు. ఇక బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రం తరువాత పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా చిత్రీకరిస్తుంది. ఇక కొరటాల శివ కూడా చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే కొరటాల సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
సయీ మంజ్రేకర్ దబాంగ్ 3’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించారు. ఇక అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘మేజర్’ సినిమాలో నటిస్తోంది. అయితే ఈమె అల్లు అర్జున్, కొరటాల శివ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఇక కొరటాల సినిమాలో అల్లు అర్జున్ కి అక్క పాత్రలో సురేఖా వాణి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారంగా ప్రకటన రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి