టాలీవుడ్ లో దర్శకులు ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొదట్లో వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ పోతూ ఆ తర్వాత స్టార్లుగా ఎదుగుతూ ఉంటారు. కొంత మంది డైరెక్టర్ లు మొదటి సినిమాతోనే పెద్ద ఛాన్స్ అందుకుంటారు.  మరి కొంతమంది డైరెక్టర్ లు రెండు మూడు సినిమాల తర్వాత గాని పెద్ద ఛాన్స్ రాదు. అలా ఇప్పుడు ఉన్న కొంతమంది యుంగ్ డైరెక్టర్లు తమ సత్తా చాటుకుని పెద్ద అవకాశాలను పొందారు.. వారెవరో చూద్దాం  .

ఓ మై ఫ్రెండ్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకుని ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాన్ని పొందారు దర్శకుడు వేణు శ్రీరామ్.  ఆ రెండు సినిమాల పనితనం బాగా నచ్చడంతో పవన్ ఈ అవకాశం ఇవ్వగా అది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరొక స్టార్ హీరో అల్లు అర్జున్ డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. మీడియం బడ్జెట్ సినిమాగా జిల్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు వంటి రెండు డిఫరెంట్ సినిమాలను చేసిన చిన్న దర్శకుడు సాగర్ కే చంద్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే స్థాయికి ఎదిగారు. ఆయన ఓ మలయాళం రీమేక్ సినిమా ను పవన్ కళ్యాణ్ , రానా హీరోగా చేస్తున్నారు ప్రస్తుతం. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి మీడియం రేంజ్ సినిమాలు చేసిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అలాగే మళ్లీ రావా, జెర్సీ వంటి సినిమాలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమా ని హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో వంటి చిత్రాలతో తన టాలెంట్ నీ ప్రూవ్ చేసుకున్న డైరెకర్ వివేక్ ఆత్రేయ నానితో అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: