బాలీవుడ్ స్టార్ హీరోల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న
హీరో అక్షయ్ కుమార్. వరుస యాక్షన్ సినిమాలతో పాటు వెరైటీ సినిమాలు చేయగల ఓకే ఒక్క
హీరో అక్షయ్. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అలరిస్తారు. అందుకే ఆయనకు
బాలీవుడ్ లో అన్ని వర్గాల నుంచి అభిమానులు ఉంటారు. కొన్ని సౌత్ సినిమాల
రీమేక్ లతో కూడా
బాలీవుడ్ జనాలను అలరించిన
అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం బెల్ బాటమ్.
ప్రతి సంవత్సరం తననుంచి మినిమమ్ మూడు సినిమాలు వచ్చేలా చూసుకుంటూ ఉంటాడు ఈ బిజీ హీరో.
కరోనా వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు కానీ ఒకసారి మొదలుపెడితే సంవత్సరానికి మూడు సినిమాలు రిలీజ్ చేయనిదే నిద్రపోడు. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే నెల 27న
ఆడియన్స్ ముందుకు థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాడు. లాక్ డౌన్ తర్వాత
బాలీవుడ్ లో విడుదలవుతున్న ఈ భారీ చిత్రం పై. మంచి అంచనాలే ఉన్నాయి.
డిజిటల్ రిలీజ్ కోసం భారీ ఆఫర్లు వచ్చినా నో చెప్పి థియేటర్లలో విడుదలకు మొగ్గు చూపింది ఈ చిత్ర బృందం. ఏకంగా 130 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా కూడా నో చెప్పి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు చిత్రబృందం. అయితే ఈ
సినిమా విడుదలైన 17 రోజుల తర్వాత డిజిటల్ గా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ కారణంగా
సినిమా డిజిటల్ రేటు తగ్గుతుందేమో అని అనుకున్నారు కానీ
అక్షయ్ కుమార్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా 17 రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ కి ఈ
సినిమా 70 కోట్ల కు అమ్ముడు అవుతుందని తెలుస్తోంది. 17 రోజుల గ్యాప్ లో మిగిలిన 60 కోట్ల వరకు బిజినెస్
థియేటర్ లలో జరిగినా, హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ మరింత సాలిడ్ గా రావచ్చు. ఏదేమైనా
అక్షయ్ కుమార్ నటించిన ఈ
సినిమా ఫలితం మీదనే అన్నీ ఆధారపడి ఉంటాయి.