వివాహం అనంతరం సమంత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే సమంత, ఈసారి మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉండటంతో ఆమెపై మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆమె తన భర్త రాజ్‌తో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లినట్లు ఫొటోలు పోస్ట్ చేయడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది.సమంత, రాజ్ నిడిమోరు కలిసి పోర్చుగల్‌లోని అందమైన నగరం లిస్బన్‌కు వెళ్లారు. అక్కడి సుందర ప్రదేశాలను సందర్శిస్తూ, షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. లిస్బన్ వీధుల్లో సరదాగా తిరుగుతూ, రెస్టారెంట్లలో ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ కనిపించిన సమంత ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
చెప్పాలంటే, సమంతకు ఇది హనీమూన్ ట్రిప్‌లా ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు మరో రకమైన చర్చకు తెరలేపారు. సమంత ప్రెగ్నెంటా..? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సమంత చాలా కఠినమైన డైట్‌ను పాటిస్తుంటుంది. తన ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఆమె, ఈసారి మాత్రం డైట్‌ను పెద్దగా పట్టించుకోకుండా తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో క్రేవింగ్స్ కారణంగా ఎక్కువగా తింటారని, అలాంటి పరిస్థితి వల్లే సమంత ఇలా ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తోందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, పెళ్లి అయ్యి ఇంకా నెల కూడా కాలేదని, ఇలాంటి రూమర్స్‌కి ఆస్కారం లేదని కొందరు అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఏది ఏమైనా, సమంత తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఈ వార్తలపై సమంత ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ప్రస్తుతం భర్తతో కలిసి ఫారిన్ ట్రిప్‌ను ఆస్వాదిస్తూ, ప్రశాంతంగా సమయం గడుపుతున్న సమంత, త్వరలోనే ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి