తెలంగాణలోని నిరుద్యోగులకు సైతం తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. 2026 కొత్త సంవత్సరంలో 14 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయబోతున్నామని అందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేస్తామని డిజిపి శివధర్ రెడ్డి తెలియజేశారు. సుమారుగా రెండేళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారని, 14 వేల కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫాం సర్వీస్లకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ముందు ఉంచామంటూ తెలిపారు.


నూతన సంవత్సరంలో ఈ పోస్టులకు సంబంధించి ప్రకటన జారీ కావచ్చు అంటూ డిజిపి కార్యాలయంలో నిన్నటి రోజున జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మూడుసార్లు మాత్రమే పోలీస్ రిక్రూమెంట్ జరిగిందని , 2016లో 9,281 పోస్టులు, 2018లో 16,925 పోస్టులు, 2022 లో 17,000 పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యాయి. 2023 నుంచి ఎటువంటి రిక్రూమెంట్ జరగలేదని, దీంతో నిరుద్యోగులు కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని డీజీపి తెలియజేశారు.



అందుకే అన్ని విధాలుగా ఆలోచించి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖలో ప్రతి ఏడాది జరుగుతున్న పదవీ విరమణ సంఖ్య వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుతోందని, అలాగే మరొకవైపు సరైన సమయాలలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. దీనివల్ల మిగిలిన సిబ్బంది పైన పని భారం పడుతోందని ఈ పోస్టులను కనీసం రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా భర్తీ చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ఇక పోలీస్ సంఘాలు కూడా పోలీసుల పైన పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని అభిప్రాయపడుతున్నారని తెలియజేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ తెలంగాణలో మాత్రం న్యూ ఇయర్ కి ముందుగానే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: