ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విషయం మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడైతే ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఆమె పేరుతో సహా వీడియో బయటకి రిలీజ్ చేశారో అప్పటినుండి ఈ మేడం పేరు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఎవరీ మాధవి.. సీఎంఓలో ఆమె పెత్తనం ఏంటి..రేవంత్ రెడ్డి తో ఆమెకున్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పుడప్పుడు కొంతమంది షాడో పవర్స్ చూపిస్తూ ఉంటారు. ఎలాంటి అధికారం లేకపోయినా పెత్తనం చెలాయిస్తూ ఉంటారు.అయితే ప్రస్తుతం ఇలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ సీఎంఓలో మాధవి లత అనే మహిళ ఎలాంటి పదవి లేకుండానే ఏకంగా ఐఏఎస్ లకు పోస్టులు కేటాయించే స్థాయికి ఎదిగిందని ప్రముఖ న్యూస్ ఛానల్ అయినటువంటి రాజ్ న్యూస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. 

అందులో ఏముందంటే.. తెలంగాణ సచివాలయంలో మాధవి లత చేతిలోనే అధికారం అంతా ఉందని, ఆమెకు ఎలాంటి పదవి లేకపోయినా కూడా ఐఏఎస్ అధికారులకి శాఖలు కేటాయించే స్థాయికి ఎదిగిందని, విఐపి ప్రోటోకాల్స్, రూల్స్, పోస్టింగులు, బదిలీలు ఇవన్నీ కూడా మాధవి లత చెప్పినట్లే జరుగుతాయని, పూర్తి పెత్తనం మొత్తం ఆమె చేతుల్లోనే ఉన్నాయని ఆ వీడియోలో స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలంగాణ సచివాలయంలో రేవంత్ రెడ్డి సన్నిహితుడు అయినటువంటి అనిల్ రెడ్డితో మాధవి లత కలిసి ఓ కౌంటర్ ఓపెన్ చేశారట. అలా సచివాలయంలో స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేసి డబ్బులు ఎక్కువగా కురిపించే ఫైల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆమె టేబుల్ మీదకి వచ్చేలా చక్రం తిప్పి మరీ వసూళ్లకు ఎగబడినట్టు తెలుస్తోంది. 

అంతేకాదు మాధవి లతకు తెలంగాణ లో ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ దేవాలయాల్లో ఆమెకు స్పెషల్ గా విఐపి దర్శనాలు, విఐపి కి ఇచ్చే హోదాని కల్పిస్తున్నారట. అంతే కాదు రేవంత్ రెడ్డికి తెలియకుండా సచివాలయంలో మాధవి లత ఇలాంటి దారుణాలకు ఒడిగడ్డదు అని సచివాలయ అధికారులు తెలుపుతున్నట్టు ఆ వీడియోలో చూపించారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో దుమారం సృష్టించి ఇంతకీ సీఎంఓలో ఉంటూ పవర్ చూపిస్తున్న ఈ షాడో మాధవి లత ఎవరు అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.అంతేకాదు రేవంత్ రెడ్డితో మాధవి లతకు ఉన్న సంబంధం ఏంటి..రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా.. దీనిపై రేవంత్ రెడ్డి వెంటనే నోరు విప్పాలి  అని డిమాండ్ చేస్తున్నారు.మరి మాధవి లత వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: