అలా.. ఏపీలో మంత్రులుగా ఉన్న వారిలో ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరు బెస్ట్ మినిస్టర్ ? అని అని పించుకుంటున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్‌పైనే అన్ని వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయ. ప్రజల్లోనూ దీనిపై నే ఎక్కువగా చర్చ నడుస్తోంది. నీళ్లులేకపోయినా.. ఓ గంట ఉంటారేమో.. కానీ, కరెంటు లేకుండా పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది.
సో.. అలాంటిశాఖ విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. నిరంతరం ప్రజలకు చేరువ అవుతూ.. ధరలు పెరగకుండా చూసుకుంటూ.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు గొట్టిపాటి రవికుమార్. సుదీర్ఘకాలంగా విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు విరబూయిస్తున్నారు. అదేవిధంగా నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇచ్చేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తన శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలోనూ గొట్టిపాటి స్పష్టమైన వైఖరితో ఉన్నారు.
ప్రధానంగా ఎప్పుడూ.. విద్యుత్ చార్జీల పెంపు వ్యవహారం ప్రజలను సతాయిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటి పరస్థితి ఏర్పడింది. అయితే..ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించడంలో గొట్టిపాటి కృషి అభినందనీయమని అంటున్నారు పరిశీలకులు. ధరలు పెరగకుండా చూసుకున్నారు. అదేసమ యంలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 13 పైసల చొప్పున యూనిట్‌కు తగ్గించారు. తద్వారా.. విద్యుత్ విషయంలో ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చూసుకుంటున్నారు. మరోవైపు.. విద్యుత్ కొనుగోళ్లను కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుకే.. ఈ ఏడాది ఉత్తమ మంత్రిగా గొట్టిపాటి నిలిచారన్నది వాస్తవం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి