రూ. 42 వేల కోట్ల పనులు :
రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేసింది. ప్రపంచ బ్యాంకు, ఆర్బీఐ మరియు ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి దాదాపు రూ. 15 వేల కోట్ల మేర నిధులను సేకరించారు. మొత్తం రూ. 42 వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ అనుమతులు మంజూరు చేసింది. దీనివల్ల అమరావతిలో ఎక్కడ చూసినా క్రేన్లు, నిర్మాణ వాహనాలతో సందడి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమరావతికి వచ్చి నిర్మాణ పనులకు మరోసారి శంకుస్థాపన చేయడం రాజధానికి జాతీయ స్థాయిలో గుర్తింపును, భరోసాను ఇచ్చింది.
భూ సమీకరణ మరియు విస్తరణ :
ప్రస్తుతం ఉన్న 33 వేల ఎకరాలకు అదనంగా మరో 44 వేల ఎకరాలను సమీకరించే ప్రక్రియను ప్రభుత్వం ఈ ఏడాదే ప్రారంభించింది. రైతుల నుంచి మొదట కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో నేరుగా చర్చలు జరిపి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. దీనివల్ల అమరావతి భవిష్యత్తులో ఒక మెగా సిటీగా అవతరించేందుకు మార్గం సుగమమైంది. కేవలం ప్రభుత్వ భవనాలే కాకుండా, అమరావతి ఆధ్యాత్మిక, వైద్య, క్రీడా హబ్‌గా మారుతోంది: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలను పోలి ఉండే అద్భుతమైన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది.
నందమూరి బాలకృష్ణ చైర్మన్‌గా ఉన్న నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఈ ఏడాదే భూమిపూజ జరిగి, నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. స్పోర్ట్స్ సిటీలో బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ తన క్రీడా అకాడమీకి శంకుస్థాపన చేశారు. అమరావతి రైతుల త్యాగం, ప్రభుత్వ సంకల్పం వెరసి 2025లో రాజధాని అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటోంది. పెట్టుబడుల వెల్లువ, మౌలిక సదుపాయాల కల్పనతో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదిగేందుకు ఈ ఏడాది గట్టి పునాది వేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి