కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ సినిమాల షూటింగులు వాయిదా పడిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్న "శ్యామ్‌ సింగరాయ్" మూవీ షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభించక ముందు "శ్యామ్‌ సింగరాయ్" మూవీకి సంబంధించి అన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఐతే ఇంకా ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉండగా.. ఈ షెడ్యూల్ లో ప్రస్తుత జనరేషన్ సీన్స్ కి సంబంధించి షూటింగ్ పూర్తి చేయనున్నారు.


ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ చిత్రాల షూటింగ్స్ పునః ప్రారంభించారు. నాని కూడా షూటింగ్ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదని భావించి వెంటనే "శ్యామ్‌ సింగరాయ్" ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు కూడా సమయం కావాల్సి ఉండగా.. నాని ఫైనల్ షూట్ ని సింగిల్ షెడ్యూల్ లో త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నారు.



ఇకపోతే శ్యామ్‌ సింగరాయ్ సినిమా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుండగా.. ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్ల హైదరాబాద్‌లోని పది ఎకరాల భూమిలో ఆరు కోట్ల ఖర్చుతో కోల్‌కతా సెట్ నిర్మించారు. దురదృష్టవశాత్తూ వర్షాల కారణంగా కోల్‌కతా సెట్ డామేజ్ అయ్యిందని సమాచారం. దీంతో మళ్లీ సెట్ నిర్మించారని తెలుస్తోంది. ఈ పిరియాడికల్ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అభిమానుల అంచనాలను పెంచేసింది. మరి ఈ విభిన్న కథా చిత్రం నాని కి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: