మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది మహానటుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గత కొన్ని దశాబ్దాల నుండి సినీ ఇండస్ట్రీలో చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించుకుని, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఇక అలాంటి వారిలో కోట శ్రీనివాసరావు గారు కూడా ఒకరు. కోట శ్రీనివాసరావు నటుడిగా పొందిన గుర్తింపు అంత తక్కువేమీ కాదు. ఈయన చేయని పాత్ర లేదు. వేయని వేషం లేదు. ఎలాంటి పాత్రలోనైనా సరే లీనమైపోయి, తనదైన శైలిలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.ఒక నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన ఈయన , ఎన్నో చిత్రాలలో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. సాధారణంగా కోట శ్రీనివాస రావు మీడియాలకు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా అరుదైన విషయం. అయితే ఇటీవల ఆయన ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ..ప్రస్తుతం వైరల్ అవుతోంది. కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. " దేవుడు నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు, నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక నటుడిగా కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందగలగడం నా అదృష్టం. ఇక నేను జీవించినంతకాలం బ్రతకడానికి ఐశ్వర్యం, ఆస్తి రెండూ ఇచ్చాడు. ఇక ఈ వయసులో కూడా నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. మా ఇంట్లో నా కోడలు ,పిల్లలు మాత్రమే ఉంటారు. పిల్లలు స్కూలుకు వెళ్లి పోతారు. అప్పట్లో 18 గంటల పాటు నిర్విరామంగా పని చేసే వాడిని, ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే బోర్ కొడుతోంది సరదాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గార్లను  మీ సినిమాల్లో ఏదైనా ఒక పాత్ర ఉంటే ఇవ్వండి చేస్తాను.. అంటూ అడిగాను. కానీ వారు ఆ విషయాన్ని సీరియస్ గా  తీసుకుని, పవన్ కళ్యాణ్ గారు నేను అడిగిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ఇప్పించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు మరోసారి చిరంజీవి మేనల్లుడు చేస్తున్న ఒక సినిమాలో  దర్శకుడు క్రిష్ మరో ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ఇక ఆ సినిమాకు కూడా మూడు రోజుల పాటు పనిచేశాను.. ఇప్పుడిప్పుడే అవకాశాలు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది" అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఆ ఇంటర్వ్యూవర్.. మీకు ఇష్టమైన నటులు ఎవరు అని అడగడంతో .. అందుకు ఆయన ఈ తరం హీరోలలో  అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ,ఆ తర్వాత మహేష్ బాబు అని,  ఇక ప్రస్తుతం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: