టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కుటుంబ కథా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'.పరమేశ్వర ఆర్ట్స్ పతాకం పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీని ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.అయితే ఈ చిత్ర కథను పరుచూరి బ్రదర్స్ రచించారు.అక్కినేని నాగేశ్వరరావు, మీనా కలిసి నటించిన సీతారామయ్య గారి మనవరాలు సినిమాని స్ఫూర్తి గా తీసుకొని ఈ సినిమా కథను డెవలప్ చేశారు పరుచూరి బ్రదర్స్.

నిజం చెప్పాలంటే గోవిందుడు అందరివాడేలే సినిమా కథ రావడానికి అక్కినేని ఫ్యామిలీనే కారణమట.అసలైతే మనం సినిమా కంటే ముందు అక్కినేని మూడు తరాల కోసం ఓ సినిమా చేయవలసిందిగా కృష్ణవంశీ ని నాగార్జున కోరగా.. ఈ కథను సెలెక్ట్ చేసుకున్నాడట దర్శకుడు.అయితే సినిమా కథ బాగున్నప్పటికి సెకండ్ ఆఫ్ పై నాగార్జున అంతగా ఆసక్తి చూపలేదు.దీంతో ఈ సినిమా కథని మెగాస్టార్ చిరంజీవికి వినిపించగా.. అది చిరూ కి బాగా నచ్చి వెంటనే ఒప్పుకొని రామ్ చరణ్ ని హీరోగా ఫిక్స్ చేసేసారు.ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలో శ్రీకాంత్ పోషించిన పాత్రలో మొదట విక్టరీ వెంకటేష్ ని అనుకున్నారు.అటు వెంకీ కూడా కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ చివరి నిమిషంలో ఆ పాత్రకు వెంకటేష్ అంతగా సెట్ అవ్వడని వద్దనుకున్నారట. అలా అక్కినేని ఫ్యామిలీ చేయాల్సిన ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి మన రామ్ చరణ్ దగ్గరకు చేరింది.అయితే కథలో ఇంకాస్త పట్టు ఉండి ఉంటే కచ్చితంగా విజయం సాధించేది.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ మెగా హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: