
సినిమా ఇండస్ట్రీలోకి కొంతమంది ఎంట్రీ ఎంతో విచిత్రంగా ఉంటుంది. వారికి సినిమా మీద ఆలోచన ఉండదు. సినిమా యాక్టర్ అవ్వాలననే ఉద్దేశం ఉండదు. కానీ వారు సినిమాల్లోకి వచ్చి హీరోగా పరిచయమై స్టార్ హీరోలుగా ఎదుగుతూ ఉంటారు. అలా టాలీవుడ్ లోకి విచిత్రమైన పరిస్థితుల్లో లో ప్రవేశించాడు హీరో నితిన్. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు.
నితిన్ తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే నితిన్ తన ప్రతిభను చూపించడంతో ఆయనను హీరోగా యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు ఆయనవి హిట్ చేసి తమ అభిమానాన్ని చూపించుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో హీరోగా మంచి స్థానం సంపాదించుకుని వరుస హిట్ సినిమాలతో కొనసాగుతున్నాడు. అయితే జయం సినిమాకు ఆయనకు అవకాశం ఎంతో చిత్రంగా లభించిందట. తేజ దర్శకత్వం వహించిన మొదటి సినిమా విడుదల సమయంలో నితిన్ ఆ సినిమా చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కి వెళ్ళాడట.
ఆ సమయంలో నితిన్ ను తేజ చూసి నువ్వు బాగున్నావ్, యాక్టర్ అవుతవా అని తనను పరిచయం చేసుకుని తన రాబోయే సినిమాలో నిన్ను పెట్టుకుంటాను అని చెప్పాడట. అయితే అప్పటికీ నితిన్ హీరోగా ఫిక్స్ అవ్వలేదట. తేజ ఓ బాలీవుడ్ సినిమాతో జయం సినిమా చేసి అందులో నితిన్ కు ఫ్రెండ్ రోల్ ఇద్దామని చూశాడట. కానీ చివరి నిమిషంలో ఆ బాలీవుడ్ హీరో సినిమాకు అందుబాటులోకి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక తేజ నితిన్ ను హీరోగా పెట్టి ఆ సినిమా చేశాడు. అదృష్టం కొద్దీ ఆ సినిమా సూపర్ హిట్ అవడం తో నితిన్ కు హీరోగా మంచి ఎస్టాబ్లిష్ ఇచ్చినట్లు అయింది. ఆ తరువాత ఆయన ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో అనే బాలీవుడ్ సినిమానీ తెలుగు లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు నితిన్.