మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడిగా నటనతో , డాన్సులతో  ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సినీ ఇండస్ట్రీలో స్టైల్ విషయంలో మిగతా హీరోలను పక్కనపెడితే రామ్ చరణ్ కు ఒక ప్రత్యేకమైన శైలి. ఈయన నటించే ప్రతి సినిమాలో కూడా సరికొత్త ఇంప్రూమెంట్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. రామ్ చరణ్ మొదట పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చిరుత సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, కాసుల వర్షం కురిపించాడు. ఇక రెండవ సినిమాతోనే దేశవ్యాప్తంగా మంచి కీర్తిని పొందడమే కాకుండా, ఈయన ఫీట్ ని ఎవరు అందుకోలేకపోయారు. దిగ్గజ  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా తీశారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అత్యధిక షేర్ రాబట్టిన చిత్రంగా మిగిలింది. ఇక మిగతా హీరోలకు ఈ చిత్రం రాబట్టిన షేర్ ను  అందుకోవడానికి  దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది.  అలా కేవలం తన రెండవ సినిమాతోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రామ్ చరణ్. అంతే కాకుండా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా గుర్తింపు పొందాడు.


ఇక  సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి, అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి తనకంటూ ఒక ట్రెండ్ ను సెట్ చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ  ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తూనే, మరో పక్క తన తండ్రి నటిస్తున్న ఆచార్య మూవీలో కూడా సిద్ధ అనే ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేమిటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
హైదరాబాద్ లో అత్యంత కాస్ట్లీ ఏరియాగా పిలుచుకునే జూబ్లీహిల్స్ లో రామ్ చరణ్ తనకోసం ఒక ప్రత్యేకమైన గృహాన్ని నిర్మించుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. అందుకోసమే తను, తన భార్య ఉపాసన సపరేటుగా ఉండడం కోసం ఒక ప్రత్యేకమైన ఇళ్లు ను  రూపొందించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ గృహనిర్మాణానికి ఏకంగా 38 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తాజా సమాచారం. ఇక తన తండ్రి ఇటీవల ఇంటిని అత్యధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఇక అంతకంటే ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించి ఇంద్ర భవనం లా నిర్మించుకోవాలని అనుకుంటున్నాడు రామ్ చరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: