టాలీవుడ్ ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ ప్రస్తుతం
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ఆర్య,
ఆర్య 2 సినిమాలు రాగా అవి సూపర్ హిట్ సినిమాలు గా మిగిలాయి. ఇప్పుడు వస్తున్న ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా లో
అల్లు అర్జున్ లారీ
డ్రైవర్ గా రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇకపోతే ఈ
సినిమా తర్వాత ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు వీరిద్దరు.
సుకుమార్ విజయ్
దేవరకొండ తో సినిమాను ప్లాన్ చేసుకోగా
అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని పేరు
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే
సినిమా చేయబోతున్నాడు. అయితే నిజానికి ఈ
సినిమా పుష్ప
సినిమా కంటే ముందుగానే షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది కానీ పుష్ప
సినిమా కథ,
సుకుమార్ తో ఫ్రెండ్షిప్ కారణంగా దాన్ని ముందుకు జరిపాడు అల్లు అర్జున్. అయితే ఈ
సినిమా మళ్లీ పట్టాలెక్కదు అనుకున్నారు. కానీ వేణు శ్రీరామ్ పవన్
కళ్యాణ్ తో వకీల్ సాబ్
సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. దీంతో మళ్ళీ ఆశలు చిగురించాయి.
అల్లు అర్జున్ కూడా పుష్ప పూర్తికాగానే ఐకాన్
సినిమా చేస్తాడనే అనుకున్నారు అందరు. కానీ ఇప్పుడు
సినిమా మరికొంత పోస్ట్ పోన్ అయ్యింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం అల్లుఅర్జున్ మరొక దర్శకుడిని లైన్లో పెట్టుకోవడమే అని తెలుస్తుంది.
అల్లు అర్జున్ తో మురుగదాస్సినిమా చేయబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలు నిజమేనని త్వరలోనే అల్లుఅర్జున్ తో పాన్
ఇండియా సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐకాన్ సినిమాను పోస్ట్ పోన్ చేశాడట అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఆ
సినిమా పోస్ట్ పోన్ అవుతుందా లేదా మొత్తానికి క్యాన్సిల్ అవుతుందా అనేది చూడాలి.