
టాలీవుడ్ లో హీరోల మధ్య అప్పుడప్పుడు కొన్ని విభేదాలు రావడం మనస్పర్ధలు రావడం సహజమే. ఒక సినిమా విషయంలో ఆ విధంగానే ఇద్దరు స్టార్ హీరోలకు ఎంతోకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయట. ఆ హీరోలే టాలీవుడ్ కి ఎంతో పేరు తీసుకొచ్చిన కేటీఆర్ మరియు సూపర్ స్టార్ కృష్ణ. వీరిద్దరు తమ తమ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించడమే కాకుండా కొన్ని సినిమాల్లో కలిసి నటించి మరికొన్ని సందర్భాలలో కలిసి కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
వీరిద్దరికీ మనస్పర్ధలు అల్లూరి సీతారామరాజు అనే సినిమా వల్ల ఏర్పడ్డాయని చాలామందికి తెలుసు. ఎన్టీఆర్ తన సినిమాల వరుసలో అల్లూరి సీతారామరాజు సినిమా చేద్దాంలే అని పోస్ట్ ఫోన్ చేసుకుంటూ రాగా కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా విడుదల చేసి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకున్నాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ కొంత బాధ పడ్డారట. తాను చేయాలనుకున్నా ఈ సినిమాను కృష్ణకు తాను చేస్తానని తెలిసి కూడా చేయడంతో ఆయన కొన్ని రోజులు కృష్ణ తో మాట్లాడకుండా ఉన్నారట.
కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు మాట్లాడుకోలేదు అని అప్పట్లో మీడియా కథనాలు రాసింది. అల్లూరి సీతారామరాజు అనే ఒక సినిమా వీరిద్దరిని ఇంత ఎడబాటుకు గురిచేసింది అన్నమాట. అయితే ఇలా జరగలేదని మరొక కథనం కూడా తెలుస్తోంది. అన్నగారు కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు ను ఒకసారి చూడండి అప్పటికీ మీరు తీయాలని అనుకుంటే తప్పకుండా కథ సిద్ధం చేస్తామని ఓ దర్శకుడు అనడం తో అప్పుడు వెంటనే కృష్ణకు ఎన్టీఆర్ ఫోన్ చేసి, బ్రదర్ మీరు చేసిన అల్లూరి సీతారామరాజు చూడాలని ఉంది వేస్తారా అనగానే ఎన్టీఆర్ కోసం ప్రత్యేక ప్రదర్శన వేశారు. రాముడిగా కృష్ణుడిగా ఆయనను చూసిన జనం అల్లూరీ గా అంగీకరిస్తారా అనేది ఎన్టీఆర్ని సందిగ్ధంలో పడేసిందట. అలా అల్లూరి సీతారామరాజు చూసి కృష్ణని అభినందించి తను సినిమా నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఎన్టీఆర్. మేజర్ చంద్రకాంత్ సినిమాలో అల్లూరి పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు.