మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ లో తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు గా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించిన రామ్ చరణ్ తేజ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాలలో తన జోష్ ను ప్రదర్శిస్తూ మెగా సినిమాలు నిర్మించడంలో ఎంతో స్పెషల్ గా నిలుస్తున్నాడు. ఇక ఆయన 2012 జూన్ 14 న తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఉపాసన కామినేని నీ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేలా ఘనంగా ఈ పెళ్లి జరిపించారు కుటుంబ సభ్యులు. అపోలో హాస్పిటల్స్ లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన రామ్ చరణ్ ను ఎంతో చూడచక్కగా చూసుకుంటుందని ఆమె సోషల్ మీడియా లో పెట్టే పోస్టులు ద్వారా తెలుస్తోంది. టాలీవుడ్ లో ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటున్న వీరికి పెళ్ళై 9 ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరని అసంతృప్తి అభిమానుల్లో నెలకొంది.

ఇదే విషయాన్ని ఆమె ను అడగగా మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. పిల్లలు 20 సంవత్సరాల ప్రేమ ప్రాజెక్టు. దానికి అవసరమైన జ్ఞానాన్ని పొందుతున్నాము. మా పిల్లలను అర్థ జ్ఞానం తో పెంచడం మాకు ఇష్టం లేదు. ఈ గ్రహంలో కి ఒకరిని తీసుకు వస్తే మీ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల గురించి తెలుసుకోవాలి అని తెలిపారు. ఒకప్పుడు దీనిపై చిరంజీవి కూడా మాట్లాడుతూ.. నిజమైన వారసుడి ని ఎత్తుకోవాలని నాకు ఉంది. నా భార్య సురేఖ చరణ్-ఉపాసనలను అడుగుతూనే ఉందిm కానీ వాళ్ళ పిల్లల ప్లానింగ్ ఏంటో మాకు అర్థం కావడం లేదు. అది వాళ్ల పర్సనల్ ఛాయిస్ అని ఆయన చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం చేస్తుండగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: